టీమ్ ఇండియా గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ఆడేందుకు 9 వేదికలను బోర్డు ఖరారు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చెన్నై వేదికగా ఆక్టోబర్ 15న జరగనున్నట్లు తెలిసింది. మొదటగా అహ్మదాబాద్ వేదికగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ భావించినా.. భద్రత కారణాల దృష్ట్యా.. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా తమ జట్టు అహ్మదాబాద్ వేదికగా ఆడేందుకు సముఖత చూపలేదని చెప్పడంతో నిర్ణయం మార్చుకున్నట్లు తెలిసింది.
మరోవైపు వన్డే వరల్డ్ కప్ 2023లోనూ పాక్-భారత్ సమరాన్ని హైదరాబాద్ క్రికెట్ ప్రియులు మిస్ కానున్నట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్. వన్డే ప్రపంచ కప్ కోసం బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసిన వేదికల లిస్ట్‌లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఒక్కటి. అయితే ఉప్పల్‌లో మాత్రం టీమ్ఇండియా ఆడే అవకాశాలు కనిపించడం లేదు. టీమ్ఇండియా మ్యాచ్‌లకు సంబంధించి బీసీసీఐ సిద్ధం చేసిన డ్రాఫ్ట్ షెడ్యూల్‌లో హైదరాబాద్ పేరు లేనట్లు సమాచారం అందింది. వేరే జట్లకు సంబంధించిన లీగ్ మ్యాచ్‌లు ఈ మైదానంలో జరిగే అవకాశాలు ఉన్నాయి.