కోహ్లీ సెంచరీపై పాక్‌ క్రికెటర్ల ప్రశంసలు..నువ్వు తోపు అంటూ !

-

ఆసియా కప్ లో భాగంగా గురు వారం ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై 101 పరుగులు తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో 61 బంధువుల్లోనే విరాట్ కోహ్లీ 122 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. దాదాపు మూడేళ్ల తర్వాత నమోదు చేసిన ఈ సెంచరీ లో 6 సిక్సర్లు మరియు 12 ఫోర్లు ఉన్నాయి. దీంతో మునుపటి కోహ్లీ గుర్తు చేశాడు.

దీంతో కోహ్లీని అందరూ పొగుడుతున్నారు. అయితే అన్ని ప్రశంసలు ఒకే ఎత్తు అయితే పాకిస్తాన్ కు చెందిన క్రికెటర్లు చేసిన ప్రశంసలు మరో ఎత్తు. ప్రస్తుతం ఆ దేశ ఆటగాళ్లు చేసిన ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. విరాట్ శతకం పై పాక్ క్రికెటర్లు ఈ విధంగా స్పందించారు. “పాక్ స్పీడ్ స్టర్ మహమ్మద్ అమీర్ స్పందిస్తూ, మొత్తానికి మా నిరీక్షణ ఫలించింది. గ్రేట్ సెంచరీ కింగ్ కోహ్లీ” అని రాసుకొచ్చాడు. ఇక మరో ఆటగాడు అయిన హాసన్ ఆలీ గొప్ప ప్లేయర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు అని వర్ణించాడు.

“ఇది కదా ఆటంటే ,ఇది కదా వేట అంటే, వాట్ ఏ క్లాస్ బ్యాటింగ్, ఇది అద్భుతమైన ఇన్నింగ్స్. మీరు కుర్రాళ్లకు ఆదర్శం విరాట్”, అంటూ పాక్ మాజీ క్రికెటర్ అజార్ మహమ్మద్ ప్రశంసించాడు. పాక్ మాజీ వికెట్ కీపర్ కామ్రాన్ అక్మల్ సైతం విరాట్ సెంచరీ పై స్పందించాడు. “ఫామ్ కేవలం తాత్కాలికమే, కానీ క్లాస్ ఆట మాత్రం పర్మినెంట్” అని కొనియాడాడు. మరి కొంతమంది భారత, ఇతర దేశాల ఆటగాళ్లు కోహ్లీ శతకం పై స్పందించారు. వారిలో హర్భజన్ సింగ్, యూసఫ్ పటాన్, కైఫ్, బద్రీనాథ్, AB డివిలియర్స్, కెవిన్ పీటర్సన్, అంజేలో మాథ్యూస్ లు ఇంకా చాలామంది ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news