మన దేశంలో ఎంతో ఆదరణ ఉన్న ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 8 నేటి నుంచి ప్రారంభం కానుంది. గతేడాది నిర్వహించాల్సిన సీజన్ 8 కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. దీంతో ఈ ఏడాది సీజన్ -8 ను నిర్వహిస్తున్నారు. మ్యాచ్ లన్నీ కూడా బెంగళూర్ వేదిక గానే జరగనున్నాయి. ఈ ఏడాది మొత్తం 12 జట్లు ఈ లీగ్ ను ఆడనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆటగాళ్లందరికీ కఠిన బయో బబుల్ నిర్వహిస్తున్నారు. అలాగే మ్యాచ్ లన్నీ కూడా ఒకే వేదిక గా నిర్వహించాలని ప్రొ కబడ్డీ నిర్వహకులు భావించారు.
అలాగే ఈ టోర్నీలో మొదటి నాలుగు రోజుల పాటు మూడు మ్యాచ్ ల చొప్పున నిర్వహించనున్నారు. అలాగే అలాగే ప్రతి శనివారం కూడా మూడు మ్యాచ్ లు నిర్వహించనున్నారు. మొదటి రోజే మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో మాజీ ఛాంపియన్స్ యూ ముంబా తో బెంగళూర్ బుల్స్ తలపడనుంది. అనంతరం మరో మ్యాచ్ తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య జరగనుంది. అలాగో మూడో మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాపింయన్ బెంగాల్ వారియర్స్ ను యూపీ యోధా ఢీ కొట్ట నుంది.