పీవీ విందు: అమూల్‌ స్టైల్‌లో పీవీ సింధు కాంస్యం సంబరాలు

-

ఎవరికైనా శుభాకాంక్షలు తెలుపడంలో దిగ్గజ పాల ఉత్పత్తిదారు అమూల్ స్టైలే వేరు. టోక్యో ఒలింపిక్స్ భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కాంస్య పతకం గెలిచింది. ఇది ఆమెకు రెండో ఒలింపిక్ మెడల్. దీనిని పురస్కరించుకుని అమూల్ తన స్టైల్‌లో శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్‌లో ఓ ఇమేజ్‌ను ఉంచింది. ఒక వైపు కాంస్య పతకంతో పీవీ సింధు.. మరోవైపు భారతీయులకు అత్యంత ఇష్టమైన అమూల్ గర్ల్‌తో కూడిన ఇమేజ్‌ను పోస్టు చేసింది. ఒలింపిక్స్‌లో పీవీ సింధు విజయాన్ని కీర్తిస్తూ ‘పీవీ విందు’గా పేర్కొంది. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో చైనా ప్లేయర్ హె బింగ్ జియో‌పై 26ఏండ్ల సింధు విజయం సాధించింది. రెండు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.

అమూల్ చేసిన పీవీ సింధు పోస్టు వైరల్ అయింది. కొన్ని గంటల్లోనే 2700 లైక్స్ వచ్చాయి. అమూల్ ట్విట్టర్ వేదికగా చాలా మంది పీవీ సింధుకు శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news