విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటిస్తా : రామ్‌చరణ్

-

ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య ఫ్లాప్ అవడంతో చరణ్ నుంచి సాలిడ్ హిట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అయితే.. తాజాగా హీరో రామ్ చరణ్ సంచలన ప్రకటన చేశాడు. అవకాశం వస్తే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తానన్నారు హీరో రామ్ చరణ్. క్రీడా నేపథ్యమున్న సినిమా చేయాలన్న కల తనకు చాలా కాలంగా ఉందన్నారు. లుక్ పరంగా తన కోహ్లీకి దగ్గరగా ఉంటానని, సిల్వర్ స్క్రీన్ పై అతడి రోల్ ను పోషించే అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు ఢిల్లీ లో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ లో అడిగిన ప్రశ్నకు చెర్రీ బదులిచ్చారు. ఇదే వేదిక పై ఆయన నాటు నాటుకు స్టెప్పులు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news