మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ కొట్టిన ఓ సిక్సర్‌కు గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ను వీక్షిస్తున్న మీనా అనే ఓ భారతీయురాలు గాయపడింది. రోహిత్ కొట్టిన బంతి మీనాకు తాకింది. దీంతో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ఆమెను పరామర్శించాడు.
బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ సెంచరీతో అద్భుత ప్రదర్శన చేసిన విషయం విదితమే. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. మరో ఎండ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు 180 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అలాగే 92 బంతుల్లో 104 పరుగులు చేసిన రోహిత్ 7 ఫోర్లు, 5 సిక్సర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకు పడ్డాడు.
అయితే మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ కొట్టిన ఓ సిక్సర్‌కు గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ను వీక్షిస్తున్న మీనా అనే ఓ భారతీయురాలు గాయపడింది. రోహిత్ కొట్టిన బంతి మీనాకు తాకింది. దీంతో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ఆమెను పరామర్శించాడు. ఆమెకు తన ఆటోగ్రాఫ్‌తో కూడిన ఓ టోపీని బహుమానంగా అందించాడు. అలాగే ఆమెతో కొంత సేపు జోక్స్ చేసి నవ్వించాడు.
కాగా రోహిత్ శర్మ ఆ ఇండియన్ క్రికెట్ అభిమాని పట్ల చూపించిన ఆత్మీయతను నెటిజన్లు అభినందిస్తున్నారు. రోహిత్ నిజంగా సున్నిత మనస్కుడని కొనియాడారు. ఈ క్రమంలో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు రోహిత్ చర్యను ప్రశంసిస్తున్నారు..!