BREAKING : రిటైర్మెంట్‌పై సానియా మీర్జా మరో ప్రకటన

-

ఇండియన్ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తన రిటైర్మెంట్‌పై మరో కొత్త ప్రకటన చేసింది. గతేడాదే ఆట నుంచి తప్పుకోవాలని అనుకున్నా.. ఆ తర్వాత మనసు మార్చుకున్న ఆమె.. తాను వీడ్కోలు పలకబోయే టోర్నీ ఏదో ఎట్టకేలకు చెప్పేసింది. ఫిబ్రవరిలో దుబాయ్‌ వేదికగా జరిగే డబ్ల్యూటీఏ 1000 టోర్నీలో తాను కెరీర్‌ను ముగించనున్నట్లు సానియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

కొత్త ఏడాదిలో ముందుగా 36 ఏళ్ల సానియా ఆస్ట్రేలియా ఓపెన్‌ ఆడనుంది. అందులో కజకిస్థాన్‌ క్రీడాకారిణి అనా డనిలినాతో కలిసి ఆమె మహిళల డబుల్స్‌లో పోటీ పడనుంది. ఇదే ఆమెకు చివరి గ్రాండ్‌స్లామ్‌ కానుంది. ఆ టోర్నీ పూర్తయ్యాక దుబాయ్‌లో ఆమె కెరీర్‌ చిట్టచివరి టోర్నీ ఆడనుంది. నిరుడు యుఎస్‌ ఓపెన్‌ ఆడి ఆటకు గుడ్‌బై చెప్పాలనుకున్న సానియాకు గాయం అడ్డంకిగా మారింది. అందుకే రిటైర్మెంట్‌ను వాయిదా వేసుకుంది.

‘‘నిజాయితీగా చెప్పాలంటే నేను ఏ విషయమైనా నాకు ఇష్టమైన రీతిలో చేయాలనుకుంటా. గాయంతో కెరీర్‌ను ముగించాలనుకోలేదు. అందుకే మళ్లీ సాధన చేశా’’ అని సానియా పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news