Australia Open : చివరి మ్యాచ్‌లో సానియాకు నిరాశ.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఓటమి

-

గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడిన భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు నిరాశే ఎదురైంది.  ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్‌లో సానియా మీర్జా- రోహన్‌ బోపన్న జోడీ ఓటమి పాలైంది. ఫైనల్‌ మ్యాచ్‌లో 6-7, 2-6 తేడాతో బ్రెజిల్‌ జంట స్టెఫాని-రఫెల్‌లో చేతిలో ఓడిపోయింది. దీంతో ఓటమితో టెన్నిస్‌ కెరీర్‌కు సానియా వీడ్కోలు పలికినట్లయింది.

2009లో మహేష్‌ భూపతితో కలిసి సానియా తన తొలి గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీ (ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌) కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో అయిదు (మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రెండు, మహిళల డబుల్స్‌లో మూడు) గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీలు సొంతం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news