TS SET 2022 Exam Dates : తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్..మార్చిలో టీఎస్ సెట్

-

తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్. మార్చిలో టీఎస్ సెట్ జరుగనుంది. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష షెడ్యూల్ ను ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించింది. మార్చి 13, 14, 15 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.

తెలంగాణ రాష్ట్రం లోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లుగా పని చేసేందుకు అర్హత పరీక్షగా దీన్ని నిర్వహిస్తారు. టీఎస్ సెట్ ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ గతేడాది డిసెంబర్ 30 నుంచి ప్రారంభం కాగా, ఈనెల 25 తో గడువు ముగిసింది.

Read more RELATED
Recommended to you

Latest news