ఆస్ట్రేలియాకు చేరిన షేన్‌వార్న్ మృత‌దేహం.. అంత్య‌క్రియ‌లు ఎప్పుడంటే?

-

ఆస్ట్రేలియా లెజెండ‌రీ స్పిన్న‌ర్ షేన్‌వార్న్ మృత దేహం ఈ రోజు ప్రత్యేక విమానంలో ఆస్ట్రేలియాకు చేరుకుంది. థాయ్ లాండ్ లోని డాన్ మ్యూంగ్ అనే ఎయిర్ పోర్టు నుంచి మెల్ బోర్న్ కు ప్ర‌త్యేక విమానంలో షేన్‌వార్న్ మృత దేహాన్ని థాయ్ ప్ర‌భుత్వం త‌ర‌లించింది. కాగ షేన్‌వార్న్.. హాలీ డేస్ ను ఎంజెయ్ చేయ‌డానికి థాయ్ లాండ్ వెళ్లారు. కాగ అక్క‌డ ఆయ‌న గుండె పోటు రావ‌డంతో గ‌త శుక్ర‌వారం మృతి చెందారు.

అయితే ఆయ‌న మృతి ప‌ట్ల కుటుంబ స‌భ్యులు, సన్నిహితులు అనుమానాలు వ్య‌క్తం చేశారు. దీంతో థాయ్ లాండ్ ప్ర‌భుత్వం షేన్‌వార్న్ మృతిపై ప్రత్యేకంగా విచార‌ణ జ‌రిపారు. ఈ విచార‌ణ‌లో షేన్‌వార్న్ గుండె పోటుతో మ‌ర‌ణించార‌ని తెలింది. విచార‌ణ ముగియ‌డంతో థాయ్ లాండ్ ప్ర‌భుత్వం షేన్‌వార్న్ మృత దేహాన్ని ఆస్ట్రేలియాకు పంపించింది. కాగ షేన్‌వార్న్ అంత్య‌క్రియల‌కు అక్క‌డి ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తుంది.

షేన్‌వార్న్ కు ఎంతో ఇష్టమైన మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లోనే ఆయ‌న అంత్య‌క్రియ‌లు జ‌ర‌పాల‌ని అక్క‌డి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అంతే కాకుండా అందుకు ఏర్పాట్లు కూడా చేస్తుంది. కాగ షేన్‌వార్న్ మృతదేహాన్ని అభిమానుల సంద‌ర్శ‌న కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కాగ షేన్‌వార్న్ అంత్య‌క్రియ‌లు ఈ నెల 30వ తేదీని అధికారిక లాంఛ‌నాల‌తో జ‌ర‌గ‌నున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news