వచ్చే ఏడాది నుంచే మహిళల ఐపీఎల్ – BCCI

-

క్రికెట్‌ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. మహిళల ఐపీఎల్ నిర్వహణ విషయంపై భారత క్రికెటర్ నియంత్రణ మండలి ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఏడాది నుంచి మహిళల ధనాధన్ లీగ్ నిర్వహిస్తామని తెలిపాడు. ఈ మేరకు గురువారం రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ లకు కీలక సమాచారం అందించాడు.

ఐపీఎల్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాంతోనే మహిళలకు కూడా ప్రత్యేకంగా ఐపీఎల్ నిర్వహించాలని చాలా ఏళ్లుగా డిమాండ్ వినిపిస్తోంది.

ఈ క్రమంలోనే టీ 20 ఛాలెంజ్ పేరిట కొన్ని మ్యాచ్లను బీసీసీఐ నిర్వహిస్తు న్నప్పటికీ, పూర్తిస్థాయి టోర్నీ మాత్రం నిర్వహించలేదు. మహిళల క్రికెట్ అభివృద్ధికి ఐపిఎల్ నిర్వహించడమే కరెక్ట్ అని భావించిన బీసీసీఐ ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మహిళాల ఐపిఎల్ నిర్వహణపై కీలక అప్డేట్ ఇచ్చాడు. పురుషుల ఐపీఎల్ కు సంబంధించి కూడా కీలక ప్రకటన చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news