ఉమెన్స్ ఆసియా కప్ టీ 20 ఫైనల్ మ్యాచ్ భారత్- శ్రీలంక జట్ల మధ్య జరుగుతోంది. దంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ తరుణంలో మొదటి వికెట్ కు 44 పరుగుల భాగస్వామ్యంతో పవర్ ప్లే లో మంచి శుభారంభాన్ని అందించింది. అలాగే మిడిల్ ఓవర్లలో కూడా నిలకడగా రాణించినప్పటికీ కీలక ప్లేయర్లు వెంట వెంటనే అవుట్ అయ్యారు.
దీంతొో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లు షెఫాలీ వర్మ 16, మందన్న 60, జెమిమా రోడ్రిగ్స్ 29, రిచా గోష్ 30 పరుగులు చేసారు. శ్రీలంక బౌలర్లలో దంబుల్లా 2, చమరి అథాపత్తు, ఉదేశిక ప్రబోధని, సచిని నిసంసాలు ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో శ్రీలంక గెలవాలంటే.. నిర్ణీత 120 బంతుల్లో 166 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మీడియమ్ స్కోరును శ్రీలంక బ్యాటర్లు చేజ్ చేసి విజయం సాధిస్తారో.. లేదా భారత బౌలర్ల చతికిల పడుతారో వేచి చూడాలి మరీ.