ఇండియాలో ప్రస్తుతం ఆదరణ పెరుగుతున్న ఆటల్లో టేబుల్ టెన్నిస్ ఒక్కటి. అయితే గత కొంత కాలంగా ఇండియాలో టేబుల్ టెన్నిస్ లివింగ్ లెజెండ్ గా కొనసాగుతున్నాడు ఆచంట శరత్ కమల్. ఈ క్రమంలోనే ప్యారిస్ ఒలంపిక్స్ కు వెళ్లిన ఆచంట శరత్ కమల్ ఇండియన్ టేబుల్ టెన్నిస్ గ్రూప్ లిడార్ గానే కాకుండా పీవీ సింధుతో కలిసి ఒలింపిక్స్ ఎంట్రీలో ఇండియన్ ఫ్లాగ్ బేరర్ గా నిలిచాడు.
దాంతో ఈ ఒలంపిక్స్ లో శరత్ కమల్ నుండి టేబుల్ టెన్నిస్ లో ఒక్క మెడల్ ఆశలు పెట్టుకున్నారు ఇండియన్ ఫ్యాన్స్. కానీ అందరి ఆశలను ఆడియదలు చేస్తూ రౌండ్ 64 లోనే ఓడిపోయి నిరుత్సహ పరిచాడు శరత్ కమల్. స్లోవేకియా ప్రత్యధి అయిన కోజుల్ డేనిపై 2-4 తేడాతో ఓటమి చవిచూశాడు. ఇది భారత అభిమానులకు ఓ రకమైన షాక్ అనే చెప్పాలి. ఇదే సమయంలో ఉమెన్స్ సింగిల్స్ రౌండ్ 64 లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ విజయం సాధించి రౌండ్ 32 కు అర్హత సాధించింది.