ఆస్ట్రేలియాతో జరిగిన కాన్బెర్రా వన్డేలో బుధవారం టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 12,000 వన్డే పరుగులు పూర్తి చేసాడు. ఈ నేపధ్యంలో కోహ్లీపై సునీల్ గవాస్కర్ ప్రసంశలు కురిపించాడు. వన్డే అంతర్జాతీయ క్రికెట్లో 12000 పరుగులు చేసిన వేగవంతమైన బ్యాట్స్మన్గా సచిన్ టెండూల్కర్ రికార్డును కొహ్లీ అధిగమించాడు. తన 251 వ మ్యాచ్లో ఈ ఘనతను సాధించాడు. కోహ్లీకి 43 సెంచరీలు మరియు 60 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
అన్ని ఫార్మాట్లలో అతని ప్రదర్శన అధ్బుతంగా ఉంది. 2008 మరియు 2009 లో అండర్ 19 ఆటగాడిగా కోహ్లీని చూసిన నాటి నుంచి అతను బ్యాట్స్ మాన్ గా ఎదిగిన విధానం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. తన ఆటను అతను మెరుగు పరిచిన విధానం… సూపర్ ఫిట్ క్రికెటర్ కావడానికి త్యాగాలు చేసిన విధానం యువకులకు స్ఫూర్తిదాయకం అన్నాడు.