వరుస విజయాలతో ఫైనల్ కి దూసుకువెళ్ళిన టీం ఇండియా మహిళల జట్టు టి20 ప్రపంచకప్ లో ఫైనల్ లో బోల్తా పడింది. దారుణ ఓటమిని ఎదుర్కొంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసిస్ జట్టుకి ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ఇద్దరు కలిసి 11.4 ఓవర్లలోనే 115 పరుగులు చేసారు. హెలీ 39 బంతుల్లో 7 ఫోర్లు 5 సిక్సులతో 75 పరుగులు చేసింది. మూనీ 54 బంతుల్లో 10 ఫోర్లతో 78 పరుగులు చేసింది.
ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ వుమెన్ పెద్దగా ఆకట్టుకోలేదు. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది ఆసిస్ జట్టు. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు… ఏ దశలో కూడా విజయం దిశగా వెళ్ళలేదు. ఓపెనర్ సఫాలి శర్మ… 2 పరుగులకే అవుట్ అయింది. ఆ తర్వాత స్మ్రితి మంధనా 11 పరుగులు, బాటియా 2 పరుగులు, రోడ్రిగేస్ డకౌట్ కాగా కౌర్ 4 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
ఆ తర్వాత దీప్తి శర్మ, 33 పరుగులు, కృష్ణ మూర్తి 19 పరుగులతో కాస్త పోరాడారు. ఆ తర్వాత వీళ్ళు కూడా అవుట్ అవ్వడంతో రిచా గోష్ 18 పరుగులు చేసింది. ఆ తర్వాత వచ్చిన, శిఖా పాండే, రాదా యాదవ్, పూనం యాదవ్, గైక్వాడ్ తలో పరుగు చేసారు. ఆసిస్ బౌలర్లలో స్కాట్ 4 వికెట్లు, జోనాసేన్ 3 వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించారు. తొలిసారి ఫైనల్ కి అడుగుపెట్టిన టీం ఇండియా విజయం ముంగిట బోల్తా పడింది.