ఉప్పల్ వేదికగా విండీస్ భారత్ టి20… క్రికెట్ ఫీవర్ తో ఊగిపోతున్న హైదరాబాద్…!

-

సొంత గడ్డపై వరుస విజయాలతో దూసుకుపోతున్న టీం ఇండియా విండీస్ తో టి20 సీరీస్ ని మొదలుపెట్టింది. ఈ సీరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి… చేజింగ్ కే మొగ్గు చూపించాడు. మంచు ప్రభావం ఉంటుందని… ఈ నేపధ్యంలో చేదన సులభం అవుతుందని… టాస్ అనంతరం మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. ఇక కొంత కాలంగా జట్టుకి దూరంగా ఉన్న… సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ జట్టులో చేరినట్టు కోహ్లి చెప్పాడు.

ఇక మ్యాచ్ ఫీవర్ తో హైదరాబాద్ లో భారీ ఎత్తున అభిమానులు మైదానానికి చేరుకున్నారు. వీకెండ్ కూడా కావడంతో భారీగా అభిమానులు వచ్చారు. ఈ మ్యాచ్ లో టీం ఇండియా బలాబలాలు ఒక్కసారి చూస్తే… ఓపెనర్లు గా రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ రానున్నారు. ఇద్దరు కూడా మంచి ఫాం లో ఉన్నారు. ఇక విరాట్ కోహ్లి మూడో స్థానంలో రానుండగా… శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చే అవకాశం ఉంది. ఇక యువ వికెట్ కీపర్ రిశాబ్ పంత్ పై కోహ్లి మరోసారి నమ్మకం ఉంచాడు. ఇటీవల అదరగొడుతున్న యువ ఆల్ రౌండర్…

శివం దుబే కి ఈ మ్యాచ్ లో అవకాశం ఇచ్చాడు కోహ్లి. స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, చాహల్ తుది జట్టులో ఉన్నారు. భారత జట్టు: రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజువేంద్ర చాహల్. వెస్టిండీస్ జట్టు: లెండిల్ సిమన్స్, ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్, హెట్‌మైర్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), దినేశ్ రాందిన్(వికెట్ కీపర్), జాసన్ హోల్డర్, హేడెన్ వాల్ష్, షెల్డన్ కాట్రెల్, కేస్రిక్ విలియమ్స్, ఖ్యారీ పిర్రే. కాగా ప్రస్తుతం విండీస్ 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది… బ్రాండన్ కింగ్ పది బంతుల్లో 17 పరుగులు చేయగా… లేవిస్ 10 బంతుల్లో 24 పరుగులు చేసాడు.

Read more RELATED
Recommended to you

Latest news