సూపర్ ఓవర్ లో టీం ఇండియా విన్…!

-

నాలుగో టి20 లో సూపర్ ఓవర్ లో టీం ఇండియా విజయం సాధించింది. కివీస్ తరుపున సేయిఫ్రేట్, మున్రో బరిలోకి దిగారు. తొలి బంతికి 2 పరుగులు చేయగా రెండో బంతికి 4 పరుగులు, మూడో బంతికి 2 పరుగులు రాగా నాలుగో బంతికి వికెట్ పడింది. అయిదో బంతికి మున్రో ఫోర్ కొట్టాడు. ఆరో బంతికి పరుగులేమి రాలేదు. దీనితో ఓవర్లో న్యూజిలాండ్ 13 పరుగులు సాధించింది. టీం ఇండియా తరుపున కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ దిగారు.

తొలి బంతికి రాహుల్ సిక్స్ కొట్టాడు. రెండో బంతికి రాహుల్ ఫోర్ కొట్టాడు. దీనితో పది పరుగులు వచ్చాయి. మూడో బంతికి కెఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు.నాలుగో బంతికి కోహ్లీ రెండు పరుగులు చేసాడు. 5 బంతికి కోహ్లీ ఫోర్ కొట్టాడు. దీనితో నాలుగో టి20 లో టీం ఇండియా ఉత్కంట విజయం సాధించింది.దీనితో 5 మ్యాచుల సీరీస్ లో టీం ఇండియా 4-0తో ఆధిక్యంలో ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news