నాలుగోది కూడా టై… సూపర్ ఓవర్…!

-

5 టి20 ల సీరీస్ లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగో టి20 టై అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. అనంతరం 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి కివీస్ విజయం ముంగిట బోల్తా పడింది

తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఓపెనర్ కెఎల్ రాహుల్ మినహా టాప్ ఆర్డర్ లో ఎవరూ కూడా ఆకట్టుకోలేదు. తొలి మూడు మ్యాచుల్లో బ్యాటింగ్ కి వెన్నుముఖగా నిలిచిన శ్రేయాస్ అయ్యర్ ఆకట్టుకోలేదు. కెప్టెన్ కోహ్లీ, రోహిత్ స్థానంలో జట్టులోకి వచ్చిన యువ ఆటగాడు సంజూ స్యామ్సన్ కూడా పెద్దగా ఫెయిల్ అయ్యారు.

ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ లో మనీష్ పాండే జట్టుకి కీలకంగా నిలిచాడు. జాగ్రత్తగా ఆడుతూ డబుల్స్, సింగిల్స్, స్కోర్ బోర్డు ని ముందుకి నడిపించాడు. ఆఖర్లో శార్దూల్ ఠాకూర్ పర్వాలేదనిపించాడు. భారత బ్యాట్స్మెన్ లో రాహుల్ 39 పరుగులు, పాండే 50 పరుగులు చేసి జట్టుని ఆదుకున్నారు. ఆ తర్వాత బరిలోకి దిగిన కివీస్ జట్టుకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ గుప్తిల్ తక్కువ స్కోర్ కే అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత మున్రో, సైఫ్రేట్ జట్టుని ఆదుకున్నారు. ఇద్దరు కలిసి 70 పరుగుల బాగస్వామ్యం నెలకొల్పారు. అయితే కీలక సమయంలో అర్ధ సెంచరి చేసి ఊపు మీదున్న మున్రో 64 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన రాస్ టేలర్ తో కలిసి సేఫ్రేట్ జట్టుని ముందుకి నడిపించాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరి కూడా పూర్తి చేసుకున్నాడు. దీనితో ఆఖరి ఓవర్లో మ్యాచ్ ఉత్కంట గా సాగింది. చివరి ఓవర్లో ఠాకూర్ బౌలింగ్ కట్టిదిట్టంగా చేయడంతో మ్యాచ్ టై అయింది.

Read more RELATED
Recommended to you

Latest news