డబ్య్లూటీసీ పరుగుల వీరులలో వెనుకబడిన కోహ్లీ

ధనాధన్ టీ 20 క్రికెట్ వచ్చాక అభిమానులు ప్రతిష్టాత్మక టెస్టు క్రికెట్ పై ఆసక్తి చూపడం లేదు. అయితే టెస్టు క్రికెట్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేలా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను తీసుకొచ్చింది. దాదాపు రెండేళ్ళ పాటు ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌ జరగగా… ప్రస్తుతం ఇండియా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. సౌతాంప్టన్ వేదికగా జూన్‌ 18 నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ ప్రారంభం కానుంది. ఇక టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ళ జాబితాను (టాప్-5) ఓ సారి పరిశీలిద్దాం…

1. మార్నస్‌ లబుషేన్‌

దేశం: ఆస్ట్రేలియా
ఆడిన మ్యాచ్‌లు/ ఇన్నింగ్స్‌ల సంఖ్య:13/23
మొత్తం పరుగులు: 1,675
సగటు: 72.82
సెంచరీలు/ అర్థ సెంచరీలు: 5/9
అత్యధిక వ్యక్తిగత స్కోర్‌: 215

2. జో రూట్‌

దేశం: ఇంగ్లాండ్
ఆడిన మ్యాచ్‌లు/ ఇన్నింగ్స్‌ల సంఖ్య: 20
మొత్తం పరుగులు: 1,660
సగటు: 47.42
సెంచరీలు/ అర్థ సెంచరీలు: 3/8
అత్యధిక వ్యక్తిగత స్కోర్‌: 228

3. స్టీవ్‌ స్మిత్‌

దేశం: ఆస్ట్రేలియా
ఆడిన మ్యాచ్‌లు/ ఇన్నింగ్స్‌ల సంఖ్య: 13/22
మొత్తం పరుగులు: 1,341
సగటు: 63.85
సెంచరీలు/ అర్థ సెంచరీలు: 4/7
అత్యధిక వ్యక్తిగత స్కోర్‌: 211

4. బెన్‌ స్టోక్స్‌

దేశం: ఇంగ్లాండ్
ఆడిన మ్యాచ్‌లు/ ఇన్నింగ్స్‌ల సంఖ్య: 17/32
మొత్తం పరుగులు:1,334
సగటు: 46
సెంచరీలు/ అర్థ సెంచరీలు: 4/6
అత్యధిక వ్యక్తిగత స్కోర్‌: 176

5. అజింక్య రహానే 

దేశం: భారత్
ఆడిన మ్యాచ్‌లు/ ఇన్నింగ్స్‌ల సంఖ్య: 17/28
మొత్తం పరుగులు: 1,095
సగటు: 43.80
సెంచరీలు/ అర్థ సెంచరీలు: 3/6
అత్యధిక వ్యక్తిగత స్కోర్‌: 115

కాగా టెస్టు ఛాంపియన్‌షిప్‌ పరుగుల వీరుల జాబితాలో రోహిత్‌ శర్మ ఆరో స్థానంలో నిలిచాడు. మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ 17 ఇన్నింగ్స్‌ల్లో 1,030 పరుగులు చేసాడు. అందులో నాలుగు సెంచరీలు, రెండు అర్థ సెంచరీలు ఉండగా.. రోహిత్‌ అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 212. అయితే ఈ జాబితాలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 11వ స్థానంలో నిలిచాడు. మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 22 ఇన్నింగ్స్‌ల్లో 877 పరుగులు చేసాడు. అందులో 2 సెంచరీలు, 5 అర్థ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 254.