స్వదేశానికి వినేశ్‌ ఫొగాట్‌.. గ్రాండ్ గా వెల్ కమ్.. కన్నీళ్లు పెట్టుకున్న రెజ్లర్

-

పారిస్ ఒలింపిక్స్ లో 100 గ్రాముల అధిక బరువుతో అనర్హత వేటుకు గురై పతకం కోల్పోయిన  భారత స్టార్‌ రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్ స్వదేశానికి చేరుకుంది. దిల్లీ విమానాశ్రయంలో ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. వీ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ వినేశ్ (నిన్న చూస్తుంటే గర్వంగా ఉంది) అంటూ నివాదాలు చేశారు. భారీగా తరలి వచ్చిన క్రీభిమానులను, వారి అభిమానాన్ని చూసిన వినేశ్‌ ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. కన్నీళ్లు పెట్టుకున్న  ఆమెను కాంగ్రెస్‌ ఎంపీ దీపిందర్‌ హుడా, రెజర్లు సాక్షి మలిక్‌, బజరంగ్‌ పునియా ఓదార్చారు.

పారిస్ ఒలింపిక్స్‌ ఫైనల్‌కు చేరిన వినేశ్‌.. 100 గ్రాములు అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైన సంగతి తెలిసిందే. కోర్టు ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్ స్పోర్ట్స్‌(కాస్‌)లో అప్పీలు చేసినా వినేశ్ కు సానుకూలంగా ఫలితం రాలేదు. ఆమె విజ్ఞప్తిని కాస్‌ కొట్టిపడేసింది. ఈ నేపథ్యంలో భారత్ కు వచ్చిన ఆమెకు ఘన స్వాగతం పలికింది. ఇక భారత్ కు వచ్చే ముందు వినేశ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పలు పోస్టులు చేసింది. తన భవిష్యత్ ఏంటో క్లారిటీ లేదని.. కానీ తన ముందుకు ఏదొచ్చినా.. పోరాడటం మాత్రం ఆపనంటూ పోస్టులో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news