వైరల్ వీడియో; కోహ్లీ రనౌట్ చూసారా…?

-

5 మ్యాచుల టి20 సీరిస్ ని క్లీన్ స్వీప్ చేసిన టీం ఇండియా మూడు మ్యాచుల వన్డే సీరీస్ తొలి మ్యాచ్ లో ఫెయిల్ అయింది. దాదాపు 350 పరుగులు చేసినా సరే టీం ఇండియా కాపాడుకోలేకపోయింది. కివీస్ జట్టు భారీ టార్గెట్ ని కూడా ఊదేసింది. మధ్యలో కాస్త తడబడినా సరే దూకుడుగా ఆడుతూ భారత జట్టుని సమర్ధవంతంగా ఎదుర్కొంది. రాస్ టేలర్ అజేయ సెంచరీతో కివీస్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇక ఇదిలా ఉంటే కోహ్లీ చేసిన రనౌట్ ఇప్పుడు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తుంది. హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్ లో టార్గెట్ చేజ్ చేస్తున్న కివీస్ కి తన రనౌట్ తో షాక్ ఇచ్చాడు. హెన్రీ నికోల్స్‌ను అద్భుతమైన ఇన్-ది-ఎయిర్ త్రోతో సంచలన రనౌట్ చేసాడు. హెన్రీ నికోల్స్ యాభై పరుగులు చేసిన తరువాత క్రీజ్ లో నిలబడ్డాడు. రాస్ టేలర్ సహాకారంతో జట్టుని ఆదుకున్నాడు.

ప్రమాదకరమైన నికోలస్ ని అవుట్ చేయడానికి అద్భుతమైన రనౌట్ చేశాడు. రాస్ టేలర్ డిఫెన్స్ ఆడి పరుగుకోసం ప్రయత్నం చేసాడు. వెంటనే కవర్స్ వైపు నుంచి దూసుకువచ్చిన కోహ్లీ గాల్లోనే ఉండి వికెట్లను గిరాటేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఒక సారిగా మైదానంలో ఈలలు చప్పట్లతో హోరెత్తించారు. కోహ్లీ వరల్డ్ బెస్ట్ ఫీల్డర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news