సచిన్ రికార్డును బ్రేక్ చేసిన వార్నర్.. ప్రపంచ కప్ చరిత్రలో తొలి బ్యాటర్ గా..!

-

టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ సరికొత్త రికార్డును సృష్టించాడు. వన్డే ప్రపంచ కప్ టోర్నీలో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్ గా రికార్డులకెక్కాడు వార్నర్. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం మాస్టర్ సచిన్ టెండూల్కర్, సౌతాఫ్రికా లెజెండర్ ఏబీ డెవిలీయర్స్ రికార్డులను వార్నర్ బద్దలు కొట్టాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో తన ప్రారంభ మ్యాచ్ లో ఆసిస్ ఆతిత్య భారత జట్టుతో తలపడుతోంది. 

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఖగారు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో మూడో ఓవర్ రెండో బంతికే మార్ష్ ను భారత బౌలర్ బుమ్రా పెవిలియన్ కి పంపాడు. బుమ్రా బౌలింగ్ లో మార్ష్ ఇచ్చిన క్యాచ్ ని విరాట్ కోహ్లీ పట్టడంతో భారత జట్టు తొలి వికెట్ ని దక్కించుకుంది. స్టీమ్ స్మిత్ తో కలిసి భాగస్వామ్యం నెలకొల్పే దిశగా కొనసాగుతున్న వార్నర్ ఏడో ఓవర్ రెండో బంతికే అరుదైన మైలు రాయిని చేరుకున్నాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో పోర్ బాది.. వన్డే ప్రపంచ కప్ లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 19 ఇన్నింగ్స్ లోనే ఈ ఘటన సాధించిన మొట్టమొదటి బ్యాటర్ గా సరికొత్త అధ్యయానికి తెరదీశాడు.

Read more RELATED
Recommended to you

Latest news