WHO: పెరుగుతున్న స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం.. 2050 నాటికి 50 శాతం అంధత్వం ఖాయం

-

పంచేంద్రియాలలో కళ్లకు ఎల్లప్పుడూ అత్యంత ముఖ్యమైన స్థానం ఉంటుంది. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అని అందుకే అంటారు. మనిషి అవయవాలలో కళ్లు అత్యంత సున్నితమైనవి. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ షాకింగ్ కథనాన్ని ప్రచురించింది. ప్రపంచంలో ప్రస్తుతం 2.2 బిలియన్ల మంది ప్రజలు దృష్టి లోపంతో బాధపడుతున్నారని అంచనా . 2050 నాటికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందట.

ప్రపంచంలో 2.2 బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రస్తుతం దృష్టి లోపంతో బాధపడుతున్నారు. 90% దృష్టి లోపం ఉన్నవారు తక్కువ, మధ్య ఆదాయ దేశాలలో ఉన్నారు. భారతదేశంలో కూడా 10 కోట్ల మందికి కళ్లద్దాలు అవసరమయ్యే పరిస్థితి ఉందట. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం మయోపియా ప్రధాన కంటి సమస్యగా మారుతోంది.

మయోపియా అంటే..

సమీప దృష్టి అనేది సమీపంలోని వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి, అదే దూరంలో ఉన్న వస్తువులు అస్పష్టంగా మాత్రమే కనిపిస్తాయి. సమీప చూపు అని కూడా పిలుస్తారు, ఈ లక్షణం వక్రీభవన కంటి పరిస్థితులలో సర్వసాధారణంగా ఉంటుంది. సాధారణ కంటి కంటే ఎక్కువ పొడవు లేదా సాధారణ కార్నియా కంటే కోణీయత కారణంగా, కాంతి రెటీనా ముందు కేంద్రీకృతమై ఉంటుంది. దీనివల్ల సుదూర వస్తువులు అస్పష్టంగా కనిపిస్తాయి. మయోపియా తేలికపాటి, మితమైన లేదా తీవ్రంగా ఉండవచ్చు.

నిజానికి… కంటి లోపం పూర్తి స్థాయిలో గుర్తించినప్పుడే ప్రజలు వైద్యుల వద్దకు వెళతారు. కానీ అప్పటికి ఇలాంటి సమస్య ఎక్కువ అవుతుంది. మయోపియా కూడా చేయాల్సిన పనులు చేయలేని స్థితికి చేరుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ – WHO 2050లో, ప్రపంచంలోని సగం మంది ప్రజలు ఇటువంటి మయోపియాతో బాధపడుతారని వివరించింది. భారతదేశంతో సహా ఆసియా దేశాల్లో సమీప దృష్టి లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మరిన్ని వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, పిల్లలను డిజిటల్ స్క్రీన్‌లకు దూరంగా ఉంచడం ద్వారా దీనిని నివారించవచ్చని తెలిపింది. అంటే స్మార్ట్ ఫోన్, టీవీ, కంప్యూటర్ చూసే సమయాన్ని తగ్గించుకోవాలి. దీంతో బాధితుల సంఖ్యను తగ్గించుకోవచ్చు. అన్ని వయసుల వారికి కంటి పరీక్షలు తప్పనిసరి. దృష్టి నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news