బ్రేకింగ్‌: చెన్నై వన్డేలో మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా

వెస్టిండీస్‌ని టీ20 సిరీస్‌లో 2-1 తేడాతో ఓడించేసిన టీమిండియా.. ఆదివారం నుంచి ఆ జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో ఢీకొట్టబోతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అలాగే భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చెన్నైలో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ నెగ్గిన వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇదిలా ఉంటే తొలి వన్డేలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది.

జట్టు స్కోర్ 80 పరుగుల దగ్గర జోసెఫ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ(36) అవుటయ్యాడు. ఆరు ఫోర్లతో మంచి జోరుమీదున్న రోహిత్‌.. హాఫ్ సెంచరీ ఖాయమనుకుంటున్న సమయంలో పోలార్డ్ చేతికి చిక్కాడు. ప్రస్తుతం క్రీజులో అయ్యర్, రిషబ్ పంత్ ఉన్నారు. జట్టు స్కోర్ 21 ఓవర్లకు మూడు వికెట్లకు 86 పరుగులు. విండీస్ బౌలర్లలో కాట్రెల్ రెండు వికెట్లు, జోసఫ్ ఒక వికెట్ తీసుకున్నారు.