అంతర్జాతీయ క్రికెట్ నుంచి టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకున్న తర్వాత ఎక్కువగా వినపడుతున్న ప్రశ్న ఒక్కటే. ఇప్పుడు టీంలో కీపర్ గా ఎవరు ఉంటారు…? ఎవరి వైపు జట్టు యాజమాన్యం మొగ్గు చూపుతుంది…? ఈ ప్రశ్నలకు ఎక్కువగా వినపడుతున్నవి కేవలం రెండు సమాధానాలు. ఒకటి కెఎల్ రాహుల్, రెండు రిషబ్ పంత్. వీరు ఇద్దరూ ఇప్పటికే తమ సత్తా చూపించుకున్నారు.
కెఎల్ రాహుల్ వన్డే, టెస్ట్, టి20 లో తన సత్తా ఏంటీ అనేది ప్రపంచానికి చాటి చెప్పాడు. కాని పంత్ మాత్రం ఇప్పటి వరకు వరుసగా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. కాని అతనిపై కోహ్లీకి నమ్మకం ఎక్కువగా ఉండటంతో పంత్ టీం లో ఉంటూ వస్తున్నాడు. ఎక్కువగా కెఎల్ రాహుల్ కే అవకాశాలు ఉండవచ్చు అని, ఏ ఫార్మాట్ అయినా సరే అతనే నెంబర్ 1 అని, కాబట్టి అతనే కాబోయే కీపర్ అని క్రీడ పండితులు చెప్పేస్తున్నారు.