Womens Asia Cup 2022 : నేటి నుంచి మహిళల ఆసియా కప్.. శ్రీలంకతో భారత్‌ తొలిపోరు

-

Womens Asia Cup 2022 : మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ నాలుగో ఎడిషన్ ఈ రోజు నుంచి బంగ్లాదేశ్ లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఏడు జట్లు పోటీ పడనున్నాయి. ఈ పోటీ రౌండ్-రాబిన్ ఫార్మాట్ లో జరుగుతుంది. ప్రతి జట్టు 6 మ్యాచ్ లు ఆడుతుంది.

మొదటి నాలుగు జట్లు సెమి ఫైనల్ లోకి ప్రవేశిస్తాయి. లీగ్ దశ అక్టోబర్ 11 వరకు కొనసాగుతుంది. సెమీఫైనల్స్ అక్టోబర్ 13న, ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది. డిఫెడింగ్ ఛాంపియన్ అయిన బంగ్లాదేశ్ టోర్నమెంట్ తొలి మ్యాచ్ థాయిలాండ్ తో ఆడుతుంది. అదేరోజు భారత రెండో మ్యాచ్ లో శ్రీలంకతో తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతుంది.

భారత మహిళా జట్టు: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, సబ్బినేని మేఘన, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), దయాళన్ హేమలత, దీప్తి శర్మ, స్నేహ రాణా, రిచా ఘోష్ (w), పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రేణుకా సింగ్, కిరణ్ నవ్‌గిరే, జెమిమా రోడ్రిగ్స్, మేఘ్నా రోడ్రిగ్స్, సింగ్, రాజేశ్వరి గయక్వాడ్

Read more RELATED
Recommended to you

Latest news