టెన్నిస్​ను తన కెరీర్​గా ఎంచుకోవాలనుకున్న యువరాజ్ సింగ్..?

-

టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో అతడు అడుగుపెడుతున్నాడంటే చాలు.. క్రికెట్​ అభిమానుల అంచనాలు పెరిగిపోతాయి. అయితే, తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను కన్న కలల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు యువీ.ఒకప్పుడు తాను టెన్నిస్​ ప్లేయర్​ కావాలని అనుకున్నట్లు తెలిపాడు. చిన్నప్పుడు తన తండ్రి కొనిచ్చిన టెన్నిస్​ రాకెట్​ను విరిచేసిన సంఘనను గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో తనకు కొత్తది కొనివ్వమని అడిగేందుకు చాలా భయపడినట్లు పేర్కొన్నాడు యువరాజ్​.

yuvi
yuvi

ఫిట్​నెస్​ను కాపాడుకునేందుకు ఇప్పటికీ కనీసం రెండ్రోజులకు ఒకసారి టెన్నిస్​ ఆడతానని చెప్పాడు యువరాజ్​. రిటైర్మెంట్​ తర్వాత కూడా క్రికెటర్లు, ఇతర ఆటగాళ్లు నిత్యం క్రీడల్లో పాల్గొనటానికి ఇష్టపడతారని అన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే సచిన్​ తనతో మాట్లాడుతూ.. “నాలుగైదు రోజులకు మించి క్రికెట్​ ఆడకపోతే.. చాలా ఆందోళన చెందుతానని” చెప్పినట్లు యువరాజ్​ వివరించాడు.యువరాజ్ సింగ్ తన కెరీర్​ మొత్తంలో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచ్​లు ఆడాడు.

Read more RELATED
Recommended to you

Latest news