టి20 మ్యాచ్ లో ఇండియాకు షాక్, కంకషన్ ప్లేయర్ గా చాహల్

కాన్బెర్రా లోని మనుకా ఓవల్‌ లో భారత్‌ ఆస్ట్రేలియా మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టీం ఇండియా బౌలింగ్ సమయంలో రవీంద్ర జడేజాకు కంకషన్ ప్లేయర్ గా యుజ్వేంద్ర చాహల్ ని ఎంచుకున్నారు. శుక్రవారం జడేజాకు ఒకటి కంటే ఎక్కువ గాయాల కారణంగా వెనక్కు తగ్గడంతో చాహల్‌ కు 4 ఓవర్లు బౌలింగ్ చేయడానికి అనుమతి ఉంటుంది.

రవీంద్ర జడేజా చివర్లో దూకుడుగా బ్యాటింగ్ చేసాడు. 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిచెల్ స్టార్క్ బౌన్సర్‌ ను ఎదుర్కొనే క్రమంలో అతని హెల్మెట్ పై బాల్ తగిలింది. ఫైనల్ ఓవర్లో జడేజా గాయపడ్డాడు. జడేజాను ప్రస్తుతం బిసిసిఐ మెడికల్ టీం పరిశీలిస్తుంది అని బోర్డ్ ఒక ప్రకటనలో చెప్పింది. జడేజా దూకుడుగా ఆడటంతో టీం ఇండియా గౌరవ ప్రదమైన స్కోర్ సాధించింది.