వసంతం.. ప్రకృతికి కొత్త రంగులొస్తాయి. ఈ రుతువులో కనిపించినంత అందంగా ఏ రుతువులోనూ కనిపించదు. ప్రకృతిలో భాగమైన వసంతమే ప్రకృతికి వన్నె తెస్తుంది. రాలిన ఆకుల స్థానంలో ఏర్పడే కొత్త చిగుళ్ళ ఆకుపచ్చ రంగులు, గోగిపూల మిలమిలలు, ప్రకృతి సోయగం అంతా వసంతంలోనే ఉంటుంది. అందుకే దీన్ని రుతువుల రాణిగా అభివర్ణిస్తారు. ఐతే ఈ రుతువులో మనం చర్మం రకరకాల మార్పులకి గురవుతుంది. అలాంటప్పుడు మనం కొన్ని చర్యలని తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఏ రుతువులో తినాల్సిన ఆహారాలని ఆ రుతువులో ఖచ్చితంగా తినాలి.
కొన్ని ఆహార పదార్థాలు కొన్ని రుతువుల్లోనే దొరుకుతాయి. ఉదాహరణకి, బచ్చలికూర, స్ట్రాబెర్రీ వంటి తక్కువగా దొరికే ఆహారాలు ఈ రుతువులో ఎక్కువగా లభిస్తాయి. వీటిని మీ డైట్ లో భాగంగా తీసుకుంటే మీ ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకి చాలా మంచిది.
కావాల్సినన్ని నీళ్ళు
వసంతం ఎండకాలానికి దారి తీస్తుంది కాబట్టి శరీరంలో నీటి నిల్వలు తగ్గిపోతుంటాయి. అందుకే ఎప్పటికప్పుడు నీటిశాతాన్ని పెంచుతూనే ఉండాలి. కాబట్టి, నీళ్ళు ఎక్కువగా తాగాలి. ఇంకా చెప్పాలంటే, కొబ్బరి నీళ్ళు తాగితే ఇంకా బెటర్.
రోగనిరోధక శక్తి
రుతువు మారినప్పుడు చిన్న జ్వరాలు రావడం కామన్. జలుబు వంటి లక్షణాలు చాలా తొందరగా అటాక్ చేస్తాయి. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి గల ఆహారాలు తీసుకోవాలి. ఫైనాపిల్, నారింజ వంటి వాటిని తీసుకోవాలి.
శరీరంలో విష పదార్థాలని బయటకి నెట్టివేయండి.
బీట్ రూట్, అవొకోడో, గ్రీన్ టీ, వంటి వాటిని ఆహారంగా తీసుకోవాలి. ఇవి శరీరంలో పేరుకుపోయిన ఇతర విష పదార్థాలని బయటకి పంపివేస్తాయి.