సాధారణంగా చాలా మంది వారంలో ఒకరోజు ముఖ్యంగా ప్రతి శుక్రవారం లేదా శనివారం రోజున తప్పకుండా ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేస్తూ ఉంటారు. అయితే ఇది అనాధి నుంచి వస్తున్న ఆచారం అయినప్పటికీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆచారాలను మొదలు పెట్టారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఇప్పటికే ఎంతోమంది ఈ ఆచారాలను కేవలం అందం, అలంకరణ కోసం మాత్రమే పాటిస్తారు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని చెప్పాలి. కానీ ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేయడం వెనుక ఒక రహస్యం కూడా దాగి ఉంది అని సైన్స్ కూడా చెబుతోంది. అది ఏమిటో ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.
సాధారణంగా ఇంటి ముందు ఆవుపేడతో కల్లాపి చల్లడం వల్ల బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్ లాంటివి బయట నుంచి లోపలికి ప్రవేశించకుండా ఈ పేడలో వుండే యాంటీ బ్యాక్టీరియా అడ్డుకుంటుంది. ముఖ్యంగా ఆవు పేడ లో ఉండే కొన్ని రకాల యాంటీ బ్యాక్టీరియల్ ఇలా బయట నుంచి వచ్చే క్రిములను, నెగటివ్ ఎనర్జీని కూడా దూరం చేస్తాయి. అందుకే ఇంటి బయట ఆవు పేడతో కళ్లాపి చల్లడం లాంటివి చేస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఇక ముగ్గు వేయడం వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే.. ఇప్పటి కాలంలో అయితే ఇసుకతో కూడిన ముగ్గును వేస్తారు.. కానీ నిజానికి బియ్యంను బాగా నానబెట్టి , ఆ తర్వాత నీడలో ఆరబెట్టాలి.
ఇక ఇప్పుడు కొద్దిగా గరక లాగా పిండి ని పట్టుకోవాలి.ఈ పిండి తోనే ముగ్గు వేయాలి. ఇక గుమ్మం ముందు ముగ్గు వేయడం వల్ల బయట నుంచి వచ్చే చీమలు, చిన్న చిన్న కీటకాలు ఆ ముగ్గులో ఉండే పిండిని తింటాయి. వాటికి ఆహారంగా కూడా లభిస్తుంది. అంతేకాదు అవి ఇంటిలోకి ప్రవేశించ లేవు. బయట నుంచి నెగటివ్ ఎనర్జీ లోపలికి ప్రవేశించకుండా ఉండాలన్నా.. ఇలాంటి చిన్నచిన్న జీవులకు ఆహారం లభించాలన్నా కూడా ఇలాంటి పనులు చేయాల్సిందే.