బీహార్ లో పండగ పూట ఘోరం జరిగింది. కల్తీ మద్యం కాటుకు ప్రజలు పిల్లల్లా రాలుతున్నారు. పండగ పూట కూడా కల్తీ మద్యం వ్యాపారులు తమ దందాను ఆపలేదు. ఫలితంగా మద్యాన్ని సేవించిన వారు చనిపోయారు. మరికొంత మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బీహార్ రాష్ట్రం గోపాల్ గంజ్ జిల్లా కుషాహర్ ప్రాంతంలో ఈ విషాదకర సంఘటన జరిగింది. కల్తీ మద్యం కాటుకు ఇప్పటి వరకు 9 మంది మరణించగా, 7 గురు తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం దాదాపు 20 మంది వరకు కల్తీ మద్యాన్ని సేవించినట్లు తెలుస్తోంది.
గతంలో 2016 లో కూడా ఈజిల్లాలో కల్తీ మద్యం కాటుకు 21 మంది మరణించారు. ఈ ఘటన తర్వాత ఇది రెండో పెద్ద సంఘటన. ఈ ఘటనలో ఈ ఏడాది మార్చిలో తొమ్మిది మందికి మరణశిక్ష విధించగా, మరో ఐదుగురికి కోర్టు జీవిత ఖైదు విధించింది.