మొదటి మ్యాచ్ లో గెలిచిన టీమిండియా… రెండో మ్యాచ్ లో మాత్రం చాప చుట్టేసింది. 207 పరుగుల భారీ లక్ష్య చేదనలో 57 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా, అక్షర్ పటేల్, సూర్య కుమార్ యాదవ్ అద్భుత హాఫ్ సెంచరీలు, శివమ్ మావి మెరుపులతో ఆఖరి ఓవర్ వరకు పోరాడి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 190 పరుగులే చేసిన టీమిండియా 16 పరుగుల తేడాతో ఓడింది.
రెండో టి20 లో గెలిచిన శ్రీలంక, టీ20 సిరీస్ ని 1-1 తేడాతో డ్రా చేయగలిగింది. 27 పరుగుల కొండంత లక్ష్య చేదనలో 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది టీం ఇండియా. రెండు పరుగులు చేసిన ఇషాన్ కిషన్ ని క్లీన్ బౌల్డ్ చేసిన రజిత, టీమిండియా కి తొలి షాక్ ఇచ్చాడు.
ఐదు పరుగులు చేసిన శుబ్ మన్ గిల్ కూడా రజిత బౌలింగ్ లోనే అవుట్ కాగా మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్న రాహుల్ త్రిపాఠి 5 పరుగులు చేసి దిల్షాన్ మధుశంక బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మూడు ఓవర్లు ముగిసే సమయానికి 27 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది భారత జట్టు. కానీ చివర్లో టీమిండియాలో బ్యాటింగ్ ఫెయిల్యూర్ తో ఓటమి పాలైంది.