నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్ర రహదారులు భవనాల శాఖలో కొత్తగా 472 పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 132 సివిల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, 90 సివిల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, 61 జూనియర్ అసిస్టెంట్స్ పోస్టులు సహా మరికొన్ని పోస్టులను కొత్తగా సృష్టించారు.
గతంలో మంజూరు చేసిన సీనియర్ స్టెనో, టైపిస్ట్, టెక్నీషియన్, ప్రింటింగ్ టెక్నీషియన్, వాచ్‌మన్, స్వీపర్ వంటి 62 ఉద్యోగాలను రద్దు చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. గతేడాది డిసెంబర్ 10న సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సమావేశమైన మంత్రివర్గం.. రోడ్లు భవనాల శాఖలో పెరిగిన పనికి అనుగుణంగా.. పునర్వ్యవస్థీకరించేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఆర్ అండ్ బీ శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను మంజూరు చేసింది.