ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో రామాయణానికి సంబంధించిన మూలాలు, శ్రీరాముడి ఆనవాళ్లు మనకు కనిపిస్తాయన్నారు. అనేక దేశాల వాసులు రామున్ని భిన్న రూపాల్లో పూజిస్తారని మోదీ అన్నారు. ఎన్నో కోట్ల మంది శ్రీరామున్ని ఆరాధిస్తున్నారన్నారు. భారత జీవన విధానంలో, మహాత్మా గాంధీ అహింసా వాదంలో రాముడు ఉన్నాడని అన్నారు.
శ్రీరాముడు మనకు మంచిగా ఎలా ప్రవర్తించాలో నేర్పాడని మోదీ అన్నారు. ఆయన అడుగు జాడల్లోనే నేడు దేశం, ప్రజలు ముందుకు సాగుతున్నారన్నారు. రాముడు సూచించిన ప్రకారం ప్రజలందరూ ఒకరికొకరు ప్రేమను పంచుకోవాలన్నారు. శ్రీరాముడి ఆశీస్సులతో దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రజలు వృద్ధిలోకి వస్తారని మోదీ అన్నారు. రాముడు మనకు మార్గనిర్దేశనం చేస్తాడని అన్నారు. కరోనా వల్ల దేశంలో చాలా దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వాటిని రాముడి ఆశీస్సులతో అధిగమిస్తామన్నారు. ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తలు వహించాలన్నారు.
కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలందరూ మాస్కులను తప్పనిసరిగా ధరించాలని మోదీ అన్నారు. శ్రీరాముడు, జానకీ దేవి ఆశీస్సులు మనకు ఉన్నాయన్నారు.