ఇండియా మాకు పెద్దన్న… క్లిష్ట సమయంలో మాకు సాయం చేస్తోంది.: అర్జున రణతుంగ శ్రీలంక మాజీ క్రికెటర్

-

తీవ్రమైన ఆర్థిక, ఆహర సంక్షోభంలో కూరుకుపోయింది శ్రీలంక. ఇతర దేశాలను సహాయం కోరుతోంది. శ్రీలంక పరిస్థితులపై ఆదేశ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ శ్రీలంక స్టార్ క్రికెటర్ అర్జున రణతుంగ. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తమ స్వలాభం కోసం మొత్తం రాజ్యాంగాన్నే మార్చేసిందని అన్నారు. భారత్ మాకు పెద్దన్నయ్య లాంటిదని… ఇండియా మా దేశానికి పెట్రోల్, మందులు వంటి అవసరాలను తీరుస్తున్నారని అన్నారు. భారత్ మాకు బాగా సాయపడుతుందని అన్నారు. శ్రీలంకలో సామాన్యులు తమ ప్రాథమిక విషయాలైన పాలపొడి, గ్యాస్, బియ్యం, పెట్రోల్ వంటివే అడుగుతున్నారని ఆయన అన్నారు. అయితే జరుగుతున్న హింసతో తాను ఏకీభవించనని అన్నారు. గత రెండేళ్లలో దేశం పెద్ద సంక్షోభంలో పడిందని అన్నారు. ప్రభుత్వం కోవిడ్ సాకులు చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రభుత్వం కోవిడ్ పరిస్థితిని సరిగ్గా ఎదుర్కోలేదని అన్నారు. ప్రభుత్వం అతివిశ్వాసంతో ఉందని విమర్శించారు. ప్రస్తుత శ్రీలంక పరిస్థితులను ఎదర్కొనే సత్తా లేకుంటే అధ్యక్షుడు గద్దె దిగాలని అన్నారు. మేము ప్రపంచ వ్యాప్తంగా డబ్బు కోసం వేడుకుంటున్నామని… అదృష్టవశాత్తూ మాకు అన్ని దేశాలు సాయం చేస్తున్నాయని… అందులో ఇండియా ప్రధానమైనదని అర్జున రణతుంగ అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news