ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ లో ఒకరిగా మారిపోయారు శ్రీ లీల. చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ తన అందంతో అభిమానుల్ని మెస్మరైజ్ చేయడమే కాకుండా దర్శక, నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయారు. ధమాకా హిట్ తో స్టార్ హీరోయిన్గా మారిపోయిన శ్రీ లీల పలు అవకాశాలు అందుపుచ్చుకొని ప్రస్తుతం బిజీ షెడ్యూల్ లో గడిపేస్తున్నారు. అయితే ఈ భామ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులతో ఎప్పటికప్పుడు అందుబాటులోనే ఉంటూ వస్తున్నారు. తాజాగా ఇన్స్టాలో ఒక పోస్ట్ ను పంచుకున్న ఈ భామ దాని కింద క్షమించమంటూ రాసుకొచ్చింది..
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలో శ్రీలీల ఒకరని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం బిజీ హీరోయిన్గా గడుపుతున్న స్త్రీలు ఇలా చేతిలో దాదాపు పది సినిమాలు ఉన్నాయి. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమాతో శ్రీ లీల తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది ఈ భామ. వెంటనే మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన ధమాకా చిత్రంలో నటించింది. కాగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచి శ్రీ లీల ను స్టార్ గా మార్చేసింది.. తన అందంతో డాన్స్ తో అభిమానుల్ని కట్టిపడేసే ఈ భామ ఎంత బిజీగా ఉన్నప్పటికీ జీవితంలో చిన్న చిన్న విషయాలు మాత్రం ఆస్వాదించడం మరిచిపోవద్దు అంటూ చెప్పుకొచ్చింది అలాగే అభిమానుల్ని క్షమించమని కూడా రాసుకొచ్చింది..
కాగా అసలు విషయం ఏంటంటే కొన్ని రోజుల క్రితం స్త్రీలు ఇలా షూటింగ్లో భాగంగా ఒక గ్రామానికి వెళ్ళింది అంట.. అక్కడ రోడ్లపై, ఆవులతో, గుడి దగ్గర దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ పోస్ట్ కింద ఒక్క క్షణం ఆగి జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయండి అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా క్వాలిటీ తక్కువగా ఉంది అభిమానులు క్షమించండి అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.