శ్రీవారి భక్తులకు టీటీడీ బ్యాడ్ న్యూస్

Join Our Community
follow manalokam on social media

ఈ ఉదయమే ఒక కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే సర్వదర్శనం టోకెన్లను 22 వేల నుంచి 15 వేలకు తగ్గించిన టీటీడీ.. ఆర్జిత సేవల విషయంలో భక్తులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.  

ఈ నెల 14వ తేదీ నుంచి భక్తులను అనుమతించాలని తొలుత నిర్ణయించిన టీటీడీ.. ఇప్పుడు వెనక్కి తగ్గింది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. కోవిడ్ పరిస్థితి చక్కబడ్డాక ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి పై నిర్ణయం తీసుకుంటామని టీటీడీ వెల్లడించింది. ఇక రిటైర్డ్ అర్చకులకు సంబంధించి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వయోపరిమితి పేరుతో రిటైర్డ్ అయిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. 

TOP STORIES

కరోనా సెకండ్ వేవ్: యువతలో కనిపించే 6 అసాధారణ లక్షణాలివే..!

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. అయితే తాజాగా...