నాని 30వ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రుతి హాసన్!

-

తమిళ … హిందీ భాషల్లో కంటే తెలుగులో శ్రుతిహాసన్ కి మంచి క్రేజ్ ఉంది. అలానే ఎక్కువ హిట్లు కూడా ఉన్నాయి. ఆ మధ్య బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ట్రై చేసిందిగానీ, ప్రయోజనం కనిపించలేదు. దాంతో ఆమె మళ్లీ టాలీవుడ్ దిశగా పరిగెత్తుకురాక తప్పలేదు. అయితే అదృష్టం కొద్దీ మళ్లీ ఆమెను సక్సెస్ లే పలకరించాయి. చాలా తక్కువ సమయంలో ఆమె ఇక్కడి నుంచి ‘ క్రాక్’ .. ‘వీరసింహా రెడ్డి’ .. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాయి. నాని తన 30వ సినిమాను కొత్త దర్శకుడితో చేస్తున్నాడు.

Shruti Haasan | Zee News

ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ ను తీసుకున్నట్టుగా సమాచారం. ఇందుకోసం ఆమెకి భారీగానే పారితోషికం ముట్టిందని అంటున్నారు. మొత్తానికి శ్రుతి హాసన్ జోరు కొనసాగుతోందనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆమె చేతిలో ‘సలార్’ వంటి పాన్ ఇండియా సినిమా ఉంది. ప్రభాస్ సరసన నాయికగా ఆమె నటిస్తున్న ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తరువాత ఆమె నాని సరసన నాయికగా చేయడానికి అంగీకరించిందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news