త్రివిక్రమ్ వైపు అనుమానంగా చూస్తున్న మహేశ్ ప్యాన్స్.!

-

సూపర్ స్టార్ మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ మూవీ ఎస్.ఎస్.ఎం.బి28  మొదటి షెడ్యూల్ పూర్తయింది. దసరా తర్వాత ప్రారంభం కావాల్సిన రెండో షెడ్యూల్ మహేష్ తల్లి ఇందిరాదేవి గారు మరణించిన కారణంగా కొద్దిగా ఆలస్యం అయ్యింది..అతడు-ఖలేజా తర్వాత మహేష్- త్రివిక్రమ్ జోడీకి హ్యాట్రిక్ చిత్రమిది.  మారిన ట్రెండ్ లో త్రివిక్రమ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాని తెరకెక్కించనున్నారు.

మహేష్  నెక్స్ట్ సినిమా రాజమౌళి తో వుండడం తో త్రివిక్రమ్ మీద విపరీతంగా  ఒత్తిడి పెరిగిపోయింది. ఆ సినిమా కంటే ముందే మహేశ్ బాబు ను పాన్ ఇండియా స్టార్ చేయాలని తనని తాను నిరూపించుకోవాలని త్రివిక్రమ్ తెగ తాపత్రయ పడుతున్నారు. దీనికోసం మంచి కథ ను త్రివిక్రమ్ రెడీ చేసారట. ఇది అన్ని వర్గాల వారికి నచ్చేలా వుంటుందట.ఇప్పటివరకు తన సినిమాల కోసం పాన్-ఇండియా రిలీజ్ టార్గెట్  చేయని మహేష్  SSMB28 తో హిందీ మార్కెట్లోనూ పాగా వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

అయితే ఈ సినిమా పై మహేష్ బాబు అభిమానులు కొంత అనుమానంగా ఉన్నారట. అంతకు ముందు సినిమా ఖలేజాను మూడు సంవత్సరాలు రాజమౌళి లాగా చెక్కి చివరకు ప్లాప్ చేసాడని అంటున్నారు. మహేశ్ బాబు కూడా ఒక ఇంటర్వ్యూ లో ఈ సినిమా కు 3 సంవత్సరాలు కేటాయించి బుద్ది తెచ్చుకున్నాను అని వ్యాఖ్యానించారు.వాస్తవానికి ఖలేజా ఇప్పుడు టీవీ లో వచ్చినా మంచి టిఆర్పి రాబట్టుతుంది. త్రివిక్రమ్ గత సినిమాల చూస్తే నమ్మకంతో వున్నా కొంత మందిని మాత్రం భయం మహేశ్ బాబు అభిమానులను వెంటాడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news