తమిళనాడు: నీట్ పరీక్ష మినహాయింపు కోరుతూ అసెంబ్లీలో బిల్ వేస్తున్న స్టాలిన్ ప్రభుత్వం

తమిళనాడుకు చెందిన 19ఏళ్ల పిల్లవాడు నీట్ పరీక్షకు హాజరు కాకుండా వాళ్ళింట్లో శవమై కనిపించాడు. తమిళనాడూలోని సేలంలో జరిగిన ఈ సంఘటన ప్రకంపనలు సృష్టిస్తుంది. మూడవసారి పరీక్షకు సిద్ధమైన పిల్లవాడు, పరీక్షలో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. ఐతే ప్రస్తుతం ఈ అంశం తమిళనాడు రాజకీయాల్లో పెద్ద చర్చ రేపుతుంది. నీట్ పరీక్ష నుండి తమిళనాడుని మినహాయించాలని కోరుతూ, శాసనసభలో బిల్ వేయనున్నారు.

ఈ మేరకు స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బిల్ కి రాష్ట్రపతి సమ్మతం కావాలని తమిళనాడు ప్రభుత్వం కోరుకుంటుంది. నీట్ పరీక్ష కారణంగా ఇదివరకే వైద్య విభాగంలో ఆసక్తి ఉన్న కొంతమంది విద్యార్థులు తమ ప్రాణాలను బలి తీసుకున్నారని, అందువల్ల తమిళనాడును నీట్ నుండి మినహాయించాలని అంటున్నారు. మరి ఈ బిల్ కి రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందో లేదో చూడాలి. 2017లో కూడా తమిళనాడు ప్రభుత్వం నీట్ వద్దని కోరుతూ బిల్ ప్రవేశ పెట్టింది. కానీ, దానికి రాష్ట్రపతి ఆమోదం లభించలేదు.