స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. అయితే ఇందులో డిపాజిట్ సర్వీసులు కూడా వున్నాయి. ఎస్బీఐ కస్టమర్ల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ సర్వీసులు మాత్రమే కాకుండా ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ ని కూడా ఇస్తోంది. అయితే ఇలాంటి స్కీమ్స్ లో చేరితే రెండు ప్రయోజనాలు పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే మంచిగా రాబడి వస్తుంది. అలానే పన్ను ఆదా కూడా. ఎస్బీఐ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్‌లో డబ్బులు పెడితే మంచిదని ట్విట్టర్ వేదికగా స్టేట్ బ్యాంక్ చెప్పింది. ఎస్బీఐ అందిస్తున్న ట్యాక్స్ సేవింగ్ స్కీమ్‌లో డబ్బులు పెట్టాలని భావిస్తే.. రూ.1000 ఉంటే సరిపోతుంది. మీరు అలాగే ఈ స్కీమ్ లో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డబ్బులు డిపాజిట్ చెయ్యచ్చు.
డబ్బులని పొదుపు చెయ్యాలని అనుకునే వారు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చెయ్యచ్చు. అయితే ఈ స్కీమ్ లో చేరిన వాళ్ళు తప్పని సరిగా వీటిని గుర్తు పెట్టుకోవాలి. ఈ స్కీమ్ లో కనీసం ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్మెంట్ చెయ్యాల్సి ఉంటుంది. వీటిని ఐదేళ్ల వరకు కూడా వెనక్కి తీసుకోవడం అవ్వదు. గరిష్టంగా పదేళ్ల టెన్యూర్ తో డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు.
మీకు నచ్చిన టెన్యూర్‌తో డబ్బులు టర్మ్ డిపాజిట్ చేసుకోవచ్చు. వడ్డీ విషయానికి వస్తే.. ఐదేళ్ల నుంచి పదేళ్ల లోపు ఎఫ్‌డీల పై 5.5 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. ట్యాక్స్ సేవింగ్ టర్మ్ డిపాజిట్ స్కీమ్‌కు కూడా ఇదే వడ్డీ రేటు వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈ స్కీమ్ లో చేరాలని అనుకుంటే పాన్ కార్డు ఉండాలి.