భారి లాభాల్లో ముగిసిన స్టాక్ మర్కెట్స్ ..!

-

నిన్నటి నష్టాలకు చెక్ పెడుతూ… నేటి మార్కెట్లు లాభాల వైపు నడిచాయి. నేడు ఉదయం మార్కెట్  మొదలైనప్పటి నుండి లాభాలతో దూసుకెళ్లాయి స్టాక్ మార్కెట్లు. ముఖ్యంగా కొన్ని కంపెనీల షేర్లు ప్రధాన మద్దతు స్థాయిలను అధిగమించి లాభాల వైపు పయనించాయి. ఇక నేడు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 408 పాయింట్లు ఎగిసి 36737 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 107 పాయింట్ల లాభంతో 10813 వద్ద ముగిసింది.

stockmarket
stockmarket

ఇక నేటి నిఫ్టీ 50 లో లాభనష్టాల విషయానికి వస్తే… ముఖ్యంగా హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, ఎస్బిఐ, టాటా స్టీల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు అత్యధిక లాభాలు పొందిన లిస్టులో ఉన్నాయి. ఇందులో హిందాల్కో కంపెనీ షేర్లు ఏకంగా 9.8 శాతం లాభ పడ్డాయి. ఇక మరోవైపు భారతీ ఇన్ఫ్రాటెల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, హీరో మోటార్ కార్ కంపెనీలు షేర్లు అత్యధిక నష్టపోయిన వాటిలో ఉన్నాయి. ఇక ఇందులో భారతీయ ఇన్ఫ్రాటెల్ కంపెనీ షేర్లు దాదాపు 5 శాతం వరకు నష్టపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news