ఎవరి జీవితం ఎప్పుడు బాగుంటుంది ఊహించలేము. జీవితంలో ఒక్కోసారి ఒక మార్పు వస్తూ ఉంటుంది. ఈ అబ్బాయి ఒక పేద కుటుంబంలో జన్మించాడు. ఆర్థిక కష్టాల తో ఇబ్బంది పడ్డాడు. ఇతను ఇంజినీరింగ్ మూడో సంవత్సరం లో కాలేజ్ నుండి బయటికి వచ్చేశాడు. అప్పుడు ఒక ఆఫీస్ బాయ్ గా చేరాడు. ఆర్థిక కష్టాలు ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
అందుకని రోడ్డు పక్కన ఒక టీ స్టాల్ ని పెట్టాడు. దీనితో ఈ అబ్బాయి బాగా ఫేమస్ అయ్యిపోయాడు. అలానే ఈ వ్యక్తి ఒక ర్యాప్ సాంగ్స్ తో బాగా ఫేమస్ అయిపోయాడు. దీనితో టీ స్టాల్ దగ్గర జనాలు వచ్చి క్యూ కడుతున్నారు మరి ఇక అతని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని పాట్నాకు సమీపంలోని ముషల్లాపూర్‌లో 28 ఏళ్ల మరియో టీ స్టాల్ ని నడుపుతున్నాడు.
అతను అంటే తెలియని వాళ్ళు ఉండదు. సాయంత్రం అయితే చాలు విద్యార్థులు, నిరుద్యోగులు, ఇతర కార్మికులు ఆ స్టాల్ ముందుకు వచ్చి అతను పాడే పాటలను వింటూ వుంటారు. స్వచ్ఛమైన బీహారీ లో ఇతను పాటలు పాటలు పాడుతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి తనకు డ్యాన్స్ కూడా ఇతనికి ఇష్టమే. పైగా అతని టీ స్టాల్‌కు విపరీతంగా గిరాకీ వస్తోంది.
చిన్న పని పెద్ద పని అని ఆలోచించకుండా నచ్చిన దారిలో వెళ్తే కచ్చితంగా సాధించచ్చు. అంతే కానీ ఎప్పుడు కూడా వెనకడుగు వెయ్యకూడదు. ఆఫీస్ బాయ్‌గా రూ.8 వేలు సంపాదించిన మరియో నెలకు రూ.80 వేలకు పైగానే సంపాదిస్తున్నాడు.