వైరల్ ఫోటో: మనిషిలా కనిపిస్తున్న వింత జీవి.. ఎక్కడ కనిపించిందో తెలుసా..?

-

ప్రపంచంలో మనిషి కంటికి కనిపించని ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. చాలా రేర్ కేసుల్లో అవి బయట పడుతుంటాయి. ఆ వింతలను చూసినప్పుడు ఒక రకమైన భయం.. ఒక రకమైన ఆశ్చర్యం కనిపిస్తోంది. తాజాగా అలాంటి ఒక ఘటనే అమెరికాలో కనిపించింది.

వింత జీవి-వైరల్ ఫోటో
వింత జీవి-వైరల్ ఫోటో

టెక్సాస్‌లోని అమారి పట్టణంలో ఓ వింత జీవి ఫోటో కనిపించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. టెక్సాస్‌లోని ఒక జూలో మే 21వ తేదీన అర్ధరాత్రి సమయంలో రెండు కాళ్లపై నడుస్తున్న ఓ జీవి కనిపించింది. ఈ ఫోటో జూలో ఉన్న సెక్యూరిటీ కెమెరాలో రికార్డు అయింది. ఆ జీవి జూ అవతల ఫెన్సింగ్ దగ్గర ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

డబ్యూఎఫ్‌టీవీ ఛానెల్9 ఈ ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఈ మేరకు ఈ వింత జీవి ఏంటని.. టెక్సాస్ జూలో వింత జీవి సంచరిస్తోందని పేర్కొంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news