వీధి కుక్కల కట్టడి GHMC కీలక నిర్ణయం..టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు

-

హైదరాబాద్​లో నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మృతి చెందడంతో రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్​తో పాటు శివారు మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల బెడద నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యే క ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు.

ఇక తాజాగా వీధి కుక్కల కట్టడి GHMC కీలక నిర్ణయం తీసుకున్నారు. కుక్కల సంతాన నియంత్రణ ప్రక్రియను వేగవంతం చేయాలని… ఫిర్యాదు చేయగానే చర్యలు తీసుకునే యంత్రాంగం ఉండాలని ఆదేశించారు మున్సిపల్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌. అలాగే, జీహెచ్‌ఎంసీ పరిధిలో వీధి కుక్కల బెడదపై 040 21111111 నంబరుకు ఫోన్‌ చేసిన వెంటనే తగిన చర్యలు తీసుకునేలా, మైజీహెచ్‌ఎంసీ యాప్‌ ద్వారానూ ఫిర్యాదులు స్వీకరించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు చేశారు మున్సిపల్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌.

Read more RELATED
Recommended to you

Latest news