ఆహారం కల్తీ చేసే వారిపై కఠిన చర్యల తప్పవు : మంత్రి దామోదర రాజనర్సింహ

-

ఆహార కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హోటల్స్ అసోసియేషన్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని తెలిపారు. హైదరాబాద్ బిర్యాని కి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని గుర్తు చేశారు. హైదరాబాద్ ను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతున్నామన్నారు. హోటల్ ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి వర్క్ షాప్ ల నిర్వహణతో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తామన్నారు. హోటల్స్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై సానుకూల స్పందించారు.

భాగ్యనగరంలో పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. నాసిరకం ఆహారం సరఫరా చేస్తూ వినియోగదారుల జేబులు ఖాళీ చేయడమే కాకుండా.. వారి ఆరోగ్యాన్ని కూడా హోటళ్ల నిర్వాహకులు నాశనం చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ఫ్రిజ్ లలో నిల్వ ఉంచి, కాలం చెల్లిన మాంసం, వస్తువులను వంటకు వినియోగిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news