ఇవాళ రాత్రి ఏపీకి అమిత్ షా.. చంద్రబాబుతో కీలక భేటీ..!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి సిద్ధం అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి.. కొత్త రికార్డు సృష్టించబోతున్నారు. మరోవైపు.. జనసేన బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండడంతో కేబినెట్ కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా తన కేబినెట్ లో సముచిత స్థానం కల్పించడంపై దృష్టిసారించారు. చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా.. కేంద్ర మంత్రులు, ఇతర పార్టీల నేతలు, ప్రముఖులు.. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకాబోతున్నారు.. రేపటి ప్రమాణ స్వీకారానికి చాలా మంది VVIPలు ఇవాళే గన్నవరం ఎయిర్పోర్ట్ కి వస్తున్నారు. వారికి ప్రత్యేకంగా వసతి ఏర్పాటు చేస్తున్నారు.

ఈ రోజు రాత్రికే గన్నవరం చేరుకోబోతున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. రాత్రి 10:20 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం కానున్నారు. దాదాపు గంట పాటు చర్చల అనంతరం రాత్రికి 11:20కి నోవోటెల్ కు చేరుకుని అక్కడే బస చేయనున్నారు అమిత్ షా.  రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. అయితే, రేపు ప్రమాణస్వీకారం అయితే, ఈ రోజు చంద్రబాబుతో అమిత్ షా భేటీ ఏంటంటే..? కేబినెట్ కూర్పు.. కూటమి ప్రభుత్వంలో బీజేపీ పాత్ర తదితర అంశాలపై ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news