స్టూడెంట్ అలెర్ట్: ఫెయిల్ అయ్యామని.. మార్కులు తక్కువొచ్చాయని చింతించకండి !

-

ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పదవ తరగతి పరీక్షా ఫలితాలను వెల్లడించాడు. అయితే ఒక పరీక్ష అన్నప్పుడు ఖచ్చితంగా అందులో పాస్ మరియు ఫెయిల్ అయ్యే వారు ఉండనే ఉంటారు. ఈ మధ్యకాలంలో ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన కొందరు విద్యార్థులు మనస్థాపం చెంది ఆత్మహత్యలకు పాలపడ్డారు. వీటిపై అప్పుడే కొందరు పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితమే అయిపోయినట్లు కాదని ఏదైనా బ్రతికి సాధించాలని వారికి చెప్పారు. ఈ రోజు వెలువడిన ఫలితాలలోనూ ఫెయిల్ అయిన వారు ఉన్నారు.

వీరు కూడా అటువంటి నిర్ణయాలు తీసుకుంటారేమోనన్న భయంతో ప్రభుత్వమే , ఇప్పుడు ఫెయిల్ అయినా మీకు జూన్ లో సప్లిమెంటరీ పరీక్షకు జరుగుతాయని ప్రభుత్వమే ప్రకటించింది. మరి మీకు తెలిసిన వారు ఎవరైనా ఫెయిల్ అయి కొంచెం బాధపడితే వారికి దైర్యం చెప్పండి అంటూ సోషల్ మీడియాలో సందేశాలు ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news