బ్రేకింగ్ : అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్

ఇటీవలే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారి అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయం ఆయన కొంతసేపటి క్రితం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ధ్రువీకరించారు. తనకు కొద్దిగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నాను అని దీనిలో కరోనా పాజిటివ్ అని వచ్చింది అని ఆయన పేర్కొన్నారు. కొద్దిరోజులుగా తనతో కలిసి పని చేసిన వారందరూ విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ పుష్ప రాజ్ అనే పాత్రలో నటిస్తున్నాడు.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది. అయితే కొద్ది రోజులుగా బన్నీ సినిమా షూటింగుకు దూరంగానే ఉంటున్నాడు అని తెలుస్తోంది అయితే నిన్న లక్షణాలు కనిపించడంతో ఆయన టెస్ట్ చేయించుకున్నారని ఈరోజు ఉదయం రిజల్ట్స్ వచ్చాయని తెలుస్తోంది.