బ్రేకింగ్: ఇండియాలో 150 జిల్లాల్లో లాక్ డౌన్

-

భారత్ లో 150 జిల్లాల్లో లాక్ డౌన్ విధించే అవకాశాలు కనపడుతున్నాయి. కరోనా పాజిటివిటీ రేటు 15 శాతం దాటిన అన్ని జిల్లాల్లో లాక్ డౌన్ విధించాలని కేంద్రం భావిస్తుంది. రాష్ట్రాలను సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేంద్రం చెప్తుంది. దేశంలో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ విఫలం అవుతుందని కేంద్రం అంటుంది.

ప్రధాని నరేంద్ర మోడీ దీనికి సంబంధించి రాష్ట్రాలతో మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఆక్సీజన్ కొరతను తీర్చడానికి కేంద్రం ఇప్పటికే చర్యలు చేపట్టినా సాధారణ పరిస్థితి రావడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news